Header Banner

ఓటీటీ: 36 అవార్డులతో రికార్డులు తిరగరాసిన థ్రిల్లర్ సినిమా.. ప్రతీ 10 నిమిషాలకు ఒక ట్విస్ట్!

  Sun May 11, 2025 13:53        Entertainment

మాములుగానే థ్రిల్లర్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. థియేటర్‌ల సంగతి అటుంచితే.. ఓటీటీలో ఏదైనా థ్రిల్లర్ సినిమా వచ్చిందంటే చాలు భాషను సైతం పట్టించుకోకుండా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తుంటారు. వీకెండ్ వచ్చిందంటే చాలు.. థ్రిల్లర్ సినిమాలేమున్నాయా అని తెగ సర్చ్ చేస్తుంటారు. కాగా ఇప్పుడు చెప్పబోయే సినిమా అలాంటిది. మళ్లీ అలాంటిది మాములు థ్రిల్లర్ సినిమా కాదు. రక్తం ఏరులై పారుతుంది. భార్యను కళ్ల ముందే హత్య చేశాడని.. ప్రత్యర్థులను విచక్షణ రహితంగా నరకుతాడు. నరకడం అంటే మళ్లీ మామలుగా కాదు.. అసలు ఏ కత్తి పోటు ఎక్కడ దిగుతుందో తెలియనంత ఘోరంగా హీరో చంపుతుంటాడు. ఇంతకీ ఆ సినిమా పేరేంటా అనుకుంటున్నారా..? అదే కిల్. ఈ మధ్య కాలంలో ఇండియన్ బాక్సాఫీస్‌ దగ్గర వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ఇది ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. గతేడాది జూలై 5న రిలీజైన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. టైటిల్‌కు తగ్గట్లే దర్శకుడు నిఖిల్ నగేష్ ఈ సినిమాలో ఊచకోత అంటే ఏంటో చూపించాడు. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. న్యూ ఢిల్లీకి వెళ్లే రైలులో దొంగలతో పోరాడే ఆర్మీ కమాండో అమృత్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.

 

ఇది కూడా చదవండి: కదులుతున్న కారులో దళిత బాలికపై గ్యాంగ్‌ రేప్‌! లక్నోలో ఉద్యోగం ఇప్పిస్తామని..

 

ఇదే కథకు ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని దర్శకుడు యాడ్ చేశారు. హీరో అమృత్‌కు తులిక అనే అమ్మాయంటే ఇష్టం. కాగా తులిక తన కుటుంబంతో కలిసి ఢిల్లీకి ప్రయాణిస్తోంది. అదే ట్రైన్‌లో అమృత్ కూడా ఉంటాడు. కాగా తులిక.. తన పేరెంట్స్‌కు కనబడకుండా అమృత్‌ను రహస్యంగా కలుస్తుంది. అంతేకాకుండా అమృత్ రైలులోని టాయిలెట్‌లో అమృత వేలికి ఉంగరం పెట్టి ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంటాడు. అంతా హ్యాపీగా సాగుతుందనుకుంటున్న టైమ్‌లో ట్రైన్‌లో దోపిడీ మొదలవుతుంది. దొంగలు గన్ చూపించి అందరినీ దోచుకుంటుంటారు. అదే టైమ్‌లో అక్కడున్నవాళ్ల అందరి మొబైల్ సిగ్నల్ జామ్ అవుతుంది. ఇక అప్పుడు దొంగలు విచక్షణ రహితంగా ప్రాణాలు తీస్తుంటారు. అది చూసిన అమృత్ మరియు అతని స్నేహితుడు ఇద్దరూ గ్యాంగ్‌స్టర్లకు వ్యతిరేకంగా పోరాడుతుంటారు. ఇంతలో, తులికలను అమృత్ కళ్ల ముందే చంపి రైలులో నుంచి తోసేస్తారు. అది చూసిన అమృత్ పట్టరాని కోపంతో కత్తి చేతిలో పట్టి.. ఎలా పడితే అలా పీకలు తెంపేస్తూ రక్త పాతం బీభత్సం సృష్టిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా కథ. కేవలం 1 గంట 45 నిమిషాల నిడివున్న ఈ సినిమా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టించదు. అంతేకాకుండా సినిమా మొత్తం ట్రైన్‌లోనే సాగడం విశేషం. కాగా ప్రస్తుతం థియేటర్‌లో ప్రదర్శితం అవుతున్న ఈ సినిమా ఆగస్ట్ 25 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.

 

ఇది కూడా చదవండి: చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia